Sunday, November 22, 2020

యేసు మాత్రమే చాలునా?


"తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?" - రోమా 8:32

దేవుని నుండి శ్రేష్టమైనవి పొందుకొనజాలమనే వదంతులు వినపడుచున్న ఈ దినములలో  పై ప్రశ్న తీవ్రంగా ఆలోచింపదగినది.  

దేవుడు మంచి ఉద్దేశముతో చెడుని మనకు చేస్తాడని అంటున్నారు.  దేవదూషణార్ధమైన ఈ ఆలోచనలు అనుసరిస్తే - దేవుడు ఒకరితో ఇలా అంటాడా?  "నీవు చాలా అందంగా ఉన్నావు, అహంకారివి కాకుండా కొంచం కుష్ఠ రోగాన్ని ఇస్తాను".   లేక మనమిలా అనగలమా?  "ఈ పాపాన్ని మంచి ఉద్దేశంతో చేస్తున్నాను."

పై వచనాన్ని మరొక మాటలో చెప్పనివ్వండి - " తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించును."

పాపము ఎరుగని , పాపము లేని మరియు పాపము చేయని మన ప్రభువైన యేసు క్రీస్తు మనందరి పాపములను తనపై మోపుకుంటానని ముందుకు వచ్చినప్పుడు, దేవుడు అనుమతించి సిలువపై మన స్థానములో తనను పాపముగా చేసెను. 

ఆయన తన సొంత కుమారుడైయున్నాను, నీతిగల తీర్పరి నిర్దాక్ష్యన్యంగా తన దేవోగ్రతను యేసు క్రీస్తుపై క్రుమ్మరించి చావునకు అప్పగించునంత తీవ్రంగా  శిక్షించెను. 

తన సొంత కుమారుని శిక్షించుట దేవునికి సంతోషమాయెను; ఎందుకనగా మనల్ని ఇక శిక్షించనక్కరలేదు.  మనల్ని ప్రేమించి  మనకొరకు మరణించుటకు దేవుడు తన కుమారుని అప్పగించెను. 

ఒక విధంగా చూస్తే, తన సొంత కుమారుని కంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. 

ఎట్టకేలకు దేవుడు తనను సమాధినుండి లేపి ప్రధానుల కంటే, అధికారులకంటే, శక్తికంటే, ఆధిపత్యం కంటే , అన్ని నామములు కంటే హెచ్చుగా తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టు కొన్నాడు.  ఇది తన శరీరమైన సంఘము కొరకై చేసెను.  (ఎఫెసీ 1:22)

మనకొరకు యేసు క్రీస్తుని ఇచ్చిన దేవుడు , తన సంఘమైన మన కొరకు అన్నింటిని  ఉచితముగా అనుగ్రహిస్తాడు. 

యేసు మాత్రమే చాలును అనుకోవడం అవివేకము.  ఎందుకనగా దేవుడు యేసుతో పాటు మనకు సమస్తమును అనుగ్రహిస్తానని అంటున్నాడు. 

నేడు పరలోకమందు మరియు భూమియందు సర్వాధికారము మన ప్రభువైన యేసు క్రీస్తుకు ఉందని మనకు తెలుసు.  సమస్తముపై తనకు ఆధిపత్యము దేవుడు ఇచ్చింది సంఘ ప్రయోజనము కొరకు. 

యోహాను 14:13 లో యేసు ఇలా సెలవిచ్చెను, "మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. "

తండ్రిని మహిమపరచాలని ఇష్ఠపడుతున్నారా? ఐతే ఉన్నతమైన వాటినే అడగండి. 

క్రీస్తు హెచ్చింపబడిన స్థితిలో ఉన్నాడని మనము గ్రహిస్తే ఆయనకు అందుబాటులో ఉన్నవన్నీ మనకు అందుబాటులో ఉన్నట్లే; అప్పుడు మనము విజయవంతముగా జీవించగలము. 

మనము కేవలము పాపమును, శరీరమును జయించుట మాత్రమే కాక, రోగాన్ని పేదరికాన్ని కూడా జయించగలము. 

Melchizedek


Saturday, November 21, 2020



"He (God) who did not spare His own Son but gave Him up (to death) for us all, how will He not also, along with Him (Jesus), freely give us all things?" - Romans 8:32

This is a powerful question to consider especially when we are hearing narratives that one cannot expect to receive good things from God and that God sometimes does bad things with a good purpose.  These negative and blasphemous ideas of God would be like Him saying, "Hey you look so beautiful - let me give you some leprosy so that you learn humility and don't get proud".  Or like us saying "I am doing this sin, but with a good motive". 

Allow me to rephrase the above verse - "He did not spare His own Son but gave Him up for us all; and now with Him, He is willing and able to give you all things freely"

When our Lord Jesus Christ who knew no sin, had no sin and committed no sin, offered to take all of our sins upon himself, God consented and made him sin in our place on the cross.

Even though he was his own son, the Righteous Judge did not spare him.  He poured out His righteous anger upon Jesus Christ and punished him to the fullest extent even unto death.

God was pleased to punish His own Son so that He didn't have to punish us whom He loved so exceedingly.  Our Lord Jesus Christ was given up by the Father to die on the cross for us all.

In a sense, God loved us more than He loved His own son.

However, God raised him up from the grave and set him up at His right hand in heaven above all principality, power, might, dominion and name, not only in this world but in that which is to come, for the benefit of the church which is His Body. (Eph 1:22 NLT)

God who gave Jesus Christ for us, will also give His church, His body all things freely.

Today, our Lord Jesus Christ has power and authority in heaven and on earth.  He is seated above everything and God did this for the benefit of the church.

Jesus said in John 14:13 - "You can ask for anything in my name, and I will do it, so that the Son can bring glory to the Father" (New Living Translation).  

Do you want to bring glory to the Father? Then ask big.

When we realize that Christ is in an exalted state and we in Him have access to everything that He has access to, we will live overcoming lives.

We will not only overcome sin and the flesh, but we will overcome sickness and poverty.  




- Melchizedek



WHAT IS THE BETTER PART?

Jesus, Mary and Martha Recently, I was conversing with a family friend and referred to her dear husband as her 'darling'.  She immed...