"తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?" - రోమా 8:32
దేవుని నుండి శ్రేష్టమైనవి పొందుకొనజాలమనే వదంతులు వినపడుచున్న ఈ దినములలో పై ప్రశ్న తీవ్రంగా ఆలోచింపదగినది.
దేవుడు మంచి ఉద్దేశముతో చెడుని మనకు చేస్తాడని అంటున్నారు. దేవదూషణార్ధమైన ఈ ఆలోచనలు అనుసరిస్తే - దేవుడు ఒకరితో ఇలా అంటాడా? "నీవు చాలా అందంగా ఉన్నావు, అహంకారివి కాకుండా కొంచం కుష్ఠ రోగాన్ని ఇస్తాను". లేక మనమిలా అనగలమా? "ఈ పాపాన్ని మంచి ఉద్దేశంతో చేస్తున్నాను."
పై వచనాన్ని మరొక మాటలో చెప్పనివ్వండి - " తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించును."
పాపము ఎరుగని , పాపము లేని మరియు పాపము చేయని మన ప్రభువైన యేసు క్రీస్తు మనందరి పాపములను తనపై మోపుకుంటానని ముందుకు వచ్చినప్పుడు, దేవుడు అనుమతించి సిలువపై మన స్థానములో తనను పాపముగా చేసెను.
ఆయన తన సొంత కుమారుడైయున్నాను, నీతిగల తీర్పరి నిర్దాక్ష్యన్యంగా తన దేవోగ్రతను యేసు క్రీస్తుపై క్రుమ్మరించి చావునకు అప్పగించునంత తీవ్రంగా శిక్షించెను.
తన సొంత కుమారుని శిక్షించుట దేవునికి సంతోషమాయెను; ఎందుకనగా మనల్ని ఇక శిక్షించనక్కరలేదు. మనల్ని ప్రేమించి మనకొరకు మరణించుటకు దేవుడు తన కుమారుని అప్పగించెను.
ఒక విధంగా చూస్తే, తన సొంత కుమారుని కంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు.
ఎట్టకేలకు దేవుడు తనను సమాధినుండి లేపి ప్రధానుల కంటే, అధికారులకంటే, శక్తికంటే, ఆధిపత్యం కంటే , అన్ని నామములు కంటే హెచ్చుగా తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టు కొన్నాడు. ఇది తన శరీరమైన సంఘము కొరకై చేసెను. (ఎఫెసీ 1:22)
మనకొరకు యేసు క్రీస్తుని ఇచ్చిన దేవుడు , తన సంఘమైన మన కొరకు అన్నింటిని ఉచితముగా అనుగ్రహిస్తాడు.
యేసు మాత్రమే చాలును అనుకోవడం అవివేకము. ఎందుకనగా దేవుడు యేసుతో పాటు మనకు సమస్తమును అనుగ్రహిస్తానని అంటున్నాడు.
నేడు పరలోకమందు మరియు భూమియందు సర్వాధికారము మన ప్రభువైన యేసు క్రీస్తుకు ఉందని మనకు తెలుసు. సమస్తముపై తనకు ఆధిపత్యము దేవుడు ఇచ్చింది సంఘ ప్రయోజనము కొరకు.
యోహాను 14:13 లో యేసు ఇలా సెలవిచ్చెను, "మీరు నా నామమున దేనినడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. "
తండ్రిని మహిమపరచాలని ఇష్ఠపడుతున్నారా? ఐతే ఉన్నతమైన వాటినే అడగండి.
క్రీస్తు హెచ్చింపబడిన స్థితిలో ఉన్నాడని మనము గ్రహిస్తే ఆయనకు అందుబాటులో ఉన్నవన్నీ మనకు అందుబాటులో ఉన్నట్లే; అప్పుడు మనము విజయవంతముగా జీవించగలము.
మనము కేవలము పాపమును, శరీరమును జయించుట మాత్రమే కాక, రోగాన్ని పేదరికాన్ని కూడా జయించగలము.
Melchizedek
No comments:
Post a Comment