హృదయపూర్వకంగా దేవుని బిడ్డ అయినవాడు ఆయనను మహిమపరచాలని ఇష్టపడతాడు. అయితే దేవుని పని చేయుట ద్వారా, మంచి పనులు తలపెట్టుట ద్వారా మరియు సత్ప్రవర్తన తో దేవుని మహిమపరచగలమని మనము నేర్పించబడ్డాము; ఇది కొంతవరకు మాత్రమే నిజము.
మహిమ అను పదము ఆదిమ గ్రీకు భాషలో δόξα (Doxa), అనగా 'మంచి అభిప్రాయము'.
పై వచనాన్ని ఇలా కూడా వ్రాయచ్చు "స్తుతియాగము అర్పించువాడు నన్ను గూర్చి మంచి అభిప్రాయము కలిగియున్నాడు."
మనము దేవుని మహిమపరచుచున్నామా? అంటే దేవునిగూర్చి మంచి అభిప్రాయము కలిగియున్నామా? దేవునిగూర్చి మంచి అభిప్రాయము కలిగియుంటేనే ఆయనకు నిజమైన స్తుతి అర్పించగలము.
దేవునిగూర్చి మంచి అభిప్రాయము కలిగియుండాలంటే మొదట......
- ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మాలి.
- ఆయన మనల్ని క్షమించాడని నమ్మాలి.
- ఆయన మనపట్ల శ్రద్ధ వహిస్తున్నాడని నమ్మాలి.
- ఆయన మనల్ని స్వస్థపరచుటకు ఇష్టపడుతున్నాడని నమ్మాలి.
- ఆయన మనల్ని ఆశీర్వదించుటకు ఇష్టపడుతున్నాడని నమ్మాలి.
- ఆయన మనల్ని వృద్ధిచేయుటకు ఇష్టపడుతున్నాడని నమ్మాలి.
- ఆయన మనల్ని హెచ్చించటానికి ఇష్టపడుతున్నాడని నమ్మాలి.
- ఆయన మనకు మేలు చేయచూస్తున్నాడని నమ్మాలి.
'మంచి' పాఠాలు నేర్పించటానికి దేవుడు కొన్ని సార్లు చెడు చేస్తాడని తలస్తే ఆయనను స్తుతించలేము. ప్రియ నేస్తమా! దేవునిగూర్చి మన అభిప్రాయము మార్చుకోవాలి. ఆయన మన తండ్రి మరియు శాశ్విత ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. "ఏ తండ్రైన తన కూమారుడు రొట్టెని అడిగితె రాయను ఇస్తాడా? చేపను అడిగితె పాముని ఇస్తాడా? గ్రుడ్డుని అడిగితె తేలును ఇస్తాడా? అని చెబుతూ తండ్రి హృదయాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు నిరూపించాడు. మన పరలోకపు తండ్రి స్వభావము ఇలా ఉండగా ఆయనను గూర్చు దురాభిప్రాయము కలిగియుండలేము కదా?
కాబట్టి, నిజముగా దేవుని మహిమపరచాలని మనమిష్టపడితే ఆయనను గూర్చి మంచి అభిప్రాయము కలిగియుండాలి. ఆయన సత్క్రియలను ప్రచురించాలి. ఆయన కరుణావాత్సల్యతను గూర్చి ప్రకటించాలి. ఆయన తన ప్రజలపట్ల చేస్తున్న మేలులను ప్రచురించాలి. సర్వమానవాళి కొరకు ఆయన మరణించాడనే వార్తను వ్యాప్తిచేయాలి. ఆయన ప్రేమగల మంచి దేవుడని చాటాలి.
పై విధముగా చేయుట దేవుని స్తుతించుట - హల్లెలూయా
గమనిక: దేవునికి స్త్రోత్రం లేక ప్రేస్ ద లార్డ్ అనేది కేవలం ఒక క్రైస్తవ పలకరింపు కాదు. దేవుని గూర్చిన మంచి అభిప్రాయాన్ని ప్రకటించుట. మనము భావపూరితంగా ప్రేస్ ద లార్డ్ అని చెబితే వాస్తవానికి దేవుని మహిమపరచుచున్నాము. ఆమెన్ !
- Melchizedek
No comments:
Post a Comment