రోమీయులు 6:14 - "పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మీరు కృపలో ఉన్నారు, ధర్మశాస్త్రము క్రింద కాదు".
మీరు ధర్మశాస్త్రము ప్రకారం ఉన్నప్పుడు, పాపం మీపై ఆధిపత్యం కలిగియుండేది. ఎందుకంటే పాపానికి బలం ధర్మశాస్త్రము.
ధర్మశాస్త్రము మీ జీవితంలో పాపాన్ని ఎత్తి చూపింది మరియు మీపై ఆరోపణలు చేసింది. అయితే, అది మిమ్మల్ని పాపవిముక్తులను చేయలేదు. .
మీపై ప్రభుత్వం చేసేది ధర్మశాస్త్రమా లేక కృపనా? తెలుసుకోవటానికి దిగువ రీతిలో మిమ్మును మీరు పరీక్షించుకోవచ్చును.
మీరు ధర్మశాస్త్రము ప్రకారం ఉంటే ................
మీరు దేవుని ఆజ్ఞలను పాటించటానికి ప్రయత్నిస్తు ఉంటారు.
మీరు అలా ప్రయత్నిస్తుంటే మీరు మీ స్వంత బలంతో చేస్తునట్లే.
మీరు మీ పాపాలను ఒప్పుకుంటూ శిక్ష భయం వల్ల క్షమించమని వేడుకుంటు ఉంటారు.
మీరు మీ పాపాలను ఒప్పుకుంటుంన్నప్పటికీ, మీరు మీ పాపాలన్నిటినీ ఒప్పుకున్న నిశ్చయత మీకు లేదు.
మీరు నిరంతరం అపరాధభావంతో ఉంటారు ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు తప్పిపోతున్నారు.
క్రీస్తు తన రక్తం ద్వారా మిమ్మల్ని క్షమించినప్పటికి మిమ్మల్ని మీరు ఖండించు కొంటున్నారు.
మీ చెడ్డ పనులను భర్తీ చేయడానికి మీరు మంచి పనులు చేస్తున్నారు.
మీరు స్వనీతితో జీవిస్తున్నారు; ఇది దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానము.
దేవుని ఆమోదం పొందడానికి మీరు ధర్మబద్ధమైన చర్యలను చేస్తున్నారు.
మీ కోసం దేవుని ఆమోదం పొందిన క్రీస్తు మరణాన్ని మీరు కించపరుస్తున్నారు.
మీ నీతి జీవితం బట్టి మీరు గర్విస్తున్నారు.
మీరు మీ మంచి పనులలో గర్వించే పరిసయ్యుడిలా ఉన్నారు.
మీరు ప్రామాణికంగా జీవించని ఇతరులను తీర్పుతీరుస్తున్నారు మరియు ఖండిస్తున్నారు.
మీరు ప్రేమలో నడవడం లేదు.
మీరు నరకానికి వెళ్తారేమోనని అనుమానిస్తున్నారు.
మీకు నిత్యజీవాన్ని వాగ్దానం చేసిన దేవుని మాటను మీరు నిరాకరిస్తున్నారు.
మీరు మీ రక్షణను కోల్పోతారేమోనని మీరు అనుకుంటున్నారు.
మీరు దేవుని మాటను అనుమానిస్తున్నారు మరియు మీరు అవిశ్వాసంతో జీవిస్తున్నారు.
మీరు కృపలో ఉంటే .....................
మీరు దేవుని బిడ్డ అని మీకు తెలుసు మరియు ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నారు.
మీరు భయపడకుండా దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నారు.
మీరు దేవుని చేత క్షమించబడ్డారని మీకు తెలుసు.
మీరు కృతజ్ఞతతో నిండి ఉంటారు.
యేసు క్రీస్తు ద్వారా మిమల్ని దేవుడు అంగీకరించారని మీకు తెలుసు.
మీరు ధైర్యంగా కృపా సింహాసనాన్ని సమీపిస్తున్నారు.
మీ పరివర్తన కోసం మీరు యేసు క్రీస్తుపై ఆధారపడుతున్నారు.
మిమ్మల్ని మార్చడానికి మీరు కృప కోసం దేవుణ్ణి కోరుతున్నారు.
దేవుని బిడ్డ అయ్యే అధికారాన్ని పొందటానికి మీరు ఏమీ చేయటంలేదు .
దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీరు మీ స్వంత బలంతో ప్రయత్నించుట లేదు.
దేవుని ఆమోదం పొందడానికి మీరు ధర్మశాస్త్రము పాటించుటలేదు.
మీరు ఏమి చేయకూడదో కాకుండా, ఏమి చేయాలనే దానిపై దృష్టి పెడుతున్నారు.
దేవుడు ఏకపక్షంగా నిన్ను ప్రేమిస్తున్నాడని మరియు నిన్ను రక్షించాడని నీకు తెలుసు.
నీవు అతన్ని తెలుసుకోక ముందే దేవుడు నిన్ను ప్రేమించాడని గ్రహించావు.
"క్రీస్తుయేసునందు నీవు దేవుని నీతి" అని నీకు తెలుసు.
మీరు నీతిమంతులుగా తయారయ్యారని మరియు మీరు తదనుగుణంగా జీవిస్తారని మీకు నమ్మకం ఉంది.
చివరగా, మీపై ఆధిపత్యం చేసేది ఏమిటి?
దేవుని కృప మీపై ప్రభుత్వం చేయాలి.
దేవుని మంచితనం మీరు ఆయనను ప్రేమించేలా చేయాలి.
దెయ్యం బిడ్డలా జీవించకూడదని ప్రయత్నించడం కంటే, దేవుని బిడ్డలా జీవించడంలో నిమగ్నమవ్వలి.
దేవుడు మీ కోసం చేసినదానికి కృతజ్ఞతతో మీ మనస్సు మరియు హృదయాన్ని నింపాలి.
మీరు దేవునికి స్నేహితుడని గ్రహించాలి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,మెల్కిసెదెకు
Wonderful Message. Thank you.
ReplyDelete