Saturday, June 20, 2020

మీరొక అద్భుత ఉత్పత్తి - ఆది నుండి అంతము వరకు.

మీరొక నూతన సృష్టి 

మీరు దేవుని కుమారులైతే, మీరొక అద్భుత ఉత్పత్తి.  


మీరు రక్త సంబంధాల ద్వారా, లేక మీ స్వంత ఇష్టము ద్వారా లేక మరొకరి బలవంతం చేత దేవుని కుమారులుగా మారలేదు. మీరు దేవుని ద్వారా మాత్రమే దేవుని కుమారులయ్యారు. ఇది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే జరిగింది  (యోహాను 1:14). 

దేవుని అక్షయమైన వాక్కు ద్వారా మీరు మళ్ళీ జన్మించారు. పరిశుద్దాత్మ ప్రవేశం ద్వారా యేసు క్రీస్తు ఉత్పత్తి అయినట్లే, దేవుని వాక్యాము మృతమైన మీ ఆత్మలోకి ప్రవేశించడం ద్వారా క్రొత్త  వ్యక్తిగా  మీరు ఉత్పత్తి అయ్యారు (1 పేతురు 1:23). 

1. మీరు పాపిగా జన్మించారు.
2. మీరు మీ పూర్వీకుడైన ఆదాము చేసిన పాప స్వభావాన్ని వారసత్వంగా పొందారు.
3. మీరు దేవుని నుండి దూరమయ్యారు.
4. మీరు దేవునితో శత్రుత్వం కలిగి ఉన్నారు.
5. మీరు నిందితులు.
6. మీరు దుష్ట మనస్సాక్షికి కట్టుబడి ఉన్నారు.
7. మీరు స్వభావికంగా  పాపములో ఉన్నారు.
8. మిమల్ని వదిలేస్తే, మీరు ఎప్పటికీ ఖండనకు పాత్రులే. 

మీ జీవితంలో ఏదో ఒక సమయంలో, మీ పాపానికి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అనే వ్యక్తి ద్వారా శిక్ష చెల్లించబడిందని, మీకు వెల్లడించిన పవిత్రాత్మకు మీరు ప్రతిస్పందించారు.  

1. యేసు క్రీస్తు (దేవుని వాక్యం) అను చెరగని బీజము ద్వారా మీరు మళ్ళీ జన్మించారని మీకు అర్ధమయ్యింది. 
2. మీ స్వాభావిక పాప గుణం మరణానికి అప్పగింపబడిందని మీరు తెలుసుకున్నారు.
3. క్రీస్తు రక్తం ద్వారా దేవుడు మిమల్ని తనతో సమాధానపరచు కొన్నాడని మీరు గ్రహించారు.
4. మీరు ఇప్పుడు దేవునికి స్నేహితుడని మీకు హామీ దొరికింది.
5. దేవుడు మీపై చేసిన ఆరోపణను ఉపసంహరించుకున్నాడని మీరు అర్థం చేసుకున్నారు.
6. మీకు మంచి మనస్సాక్షి ఇవ్వబడింది.
7. మీరు దేవుని నీతిగా తయారయ్యారు.
8. మీరు ఇప్పుడు శాశ్వతంగా రక్షింపబడారని తెలుసుకొన్నారు. 

పై విధంగా మీకు జరిగితే, మీరు దేవుని అద్భుత ఉత్పత్తి.  మీలో ఈ అద్భుతమైన  పనిని దేవుడు అద్భుతంగా చేసాడు. మీకు కలిగిన తెలివైన ఆలోచన వలన కాదు. ఇది జరగడానికి మీరు మీ వైపు నుండి ఏమీ చేయలేదు.

మీ నూతన జన్మ ఒక అద్భుతం అయితే;  మీ నూతన జీవితం కూడా ఒక అద్భుతంగానే ఉండాలి.  

ఆత్మలో ఏమి ప్రారంభించబడిందో, మీరు ఇప్పుడు దానిని శరీరముతో ముగించడానికి ప్రయత్నిస్తున్నారా?
కృపచేత మీరు రక్షించబడితే, మీరు రక్షణలో కొనసాగటానికి ధర్మశాస్త్రాన్ని ఎందుకు వర్తింపజేస్తున్నారు?
మీలో ఈ మంచి పనిని ప్రారంభించిన దేవుడు దానిని పూర్తి చేయనివ్వండి.

ఇప్పుడు మీరు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి సమీపస్థులై ఉన్నారు, మీరు కృపాసింహాసనాన్ని ధైర్యంగా సంప్రదించవచ్చు.   మీ పరివర్తన కొరకు అద్భుతంగా కృపను  పొందవచ్చు.

మీరు శత్రువుగా ఉన్నప్పుడు సయోధ్య పని (క్రొత్త పుట్టుక యొక్క అద్భుతం) జరిగితే, ఇప్పుడు మీరు అతని స్నేహితుడు గనుక దేవుడు మీ కోసం ఇంకా ఎంత ఎక్కువ చేస్తాడు (కొత్త జీవిత అద్భుతాలు) ?

మీరు ఇప్పుడు చేయవలసినవి:
  • మీ ప్రయత్నాలు మరియు కృషిని దూరంగా ఉంచండి.
  • మీరు దేవుని ఎదుట ఇక తీర్మానాలను చేయకండి. 
  • మీ స్వీయ క్రమశిక్షణ పనులను దూరం పెట్టండి. 
  • మీ స్వీయ నిర్వహణ నైపుణ్యాలను దూరంగా ఉంచండి.
  • ప్రవర్తన సవరణను ఆపండి. 
మరియు . . . . . . . . . . . . . . . . . 
  • దేవుడు మీలో ప్రారంభించిన మంచి పనిని పూర్తి చేస్తాడనే సత్యంలో విశ్రాంతి తీసుకోండి.
  • దేవుని వాగ్దానాలలో నిలకడగా ఉండండి. 
  • క్రీస్తు ముగించిన  పనిలో విశ్రాంతిని అనుభవించండి.
  • దేవుడు మిమ్మల్ని అద్భుతంగా మారుస్తాడు.
  • దేవుడు మాత్రమే చేయగల హృదయ పరివర్తన పనికొరకు ఆశతో కనిపెట్టండి. 
ఒక అద్భుతం వలె ప్రారంభమైనది అద్భుతంగానే  ముగుస్తుంది.
దేవుని పనిలో జోక్యం చేసుకోకండి మరియు మీ కోసం కొంత క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించకండి .
మీరు కృప ద్వారా రక్షింపబడ్డారు మరియు కృప ద్వారానే  మీరు రక్షణలో కొనసాగగలరు.

- Melchizedek



No comments:

Post a Comment

WHAT IS THE BETTER PART?

Jesus, Mary and Martha Recently, I was conversing with a family friend and referred to her dear husband as her 'darling'.  She immed...