మన ప్రభువైన యేసు క్రీస్తు మోషే ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చాడు?
ద్వితీయోపదేశకాండము 28: 1,2 - "నీ దేవుడైన యెహోవా స్వరమును మీరు శ్రద్ధగా విని, ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తే, మీరు భూమిలోని అన్ని దేశాలకన్నా ఎత్తులో ఉంటారు. మీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు వింటే, ఈ ఆశీర్వాదాలన్నీ మీపైకి వస్తాయి."
ద్వితీయోపదేశకాండము 28:15 - "నీ దేవుడైన యెహోవా స్వరాన్ని మీరు విని, ఆయన మీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, శాసనాలను పాటిస్తే; ఈ శాపాలన్నీ మీపైకి వచ్చి మిమ్మల్ని అధిగమిస్తాయి."
నెరవేరిస్తే జీవము; నెరవేర్చకపోతే మరణము.
ధర్మశాస్త్రమును రెండు విధములుగా నెరవేర్చవచ్చును.
1. ధర్మశాస్త్రాన్ని క్షున్నంగా పాటించి జీవాన్ని పొందడం లేక
2. ధర్మశాస్త్రాన్ని పాటించకుండా మరణాన్ని పొందడం.
గమనించండి - "ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అంతా పాటించి, ఒక దశలో విఫలమవుతారో వారు మొత్తం ధర్మశాస్త్రములో విఫలమైనట్లే " (యాకోబు 2:10)
ఇలాగైతే ఎవ్వరూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు. కాబట్టి అందరూ దోషిలుగానే మిగిలిపోతారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోవటం వలన కలుగు మరణశిక్షను యేసు తనపై వేసుకొని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడాయెను.
మన తరపున అయన ఇలా చేయటం ద్వారా, క్రీస్తులో మనమందరం ధర్మశాస్త్రాన్ని నెర వేర్చినవారమైతిమి. తత్ఫలితముగా మనము విశ్వసించిన తక్షణమే నీతిమంతులముగా అయ్యాము. "పాపం తెలియనివాడు మన కొరకు పాపముగా అయ్యాడు, తద్వారా మనము క్రీస్తు యేసులో దేవుని నీతి అయ్యాము. "
ప్రశ్న: ఏ నీతి కార్యము చేయకుండా నీతిమంతులముగా ఎలా అవ్వగలము ?
సమాధానం: యేసు క్రీస్తు ఏ పాపం చేయకుండా పాపిగా అయ్యినట్లే.
మనము దేవుని నీతిగా అయ్యామని గ్రహించి ఆ ప్రకారము ప్రవర్తింపగలమని నమ్మాలి. దేవుని కృప ద్వారా నీతిమంతులమైనాము; కాబట్టి ధైర్యముగా ఆయన కృపాసింహాసనము యొద్దకు రాగలము.
ఇకనుండి ఏమి చేయకూడదో తెలుసుకోవడం కంటే; ఏమి చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. మనము దేవుని కుమారులమనే స్పృహలో జీవించాలి.
No comments:
Post a Comment