యిర్మీయా 17:5 |
దీవించబడిన మనిషికి, శపించబడిన మనిషికి మధ్యగల వ్యత్యాసాన్ని చూద్దాం. మీరు శపించబడిన వ్యక్తి ఎలా అవుతారో మరియు శపించబడిన జీవితం ఎలా ఉంటుందో బైబిలులో స్పష్టంగా ఉంది. దేవుని వాక్యము మీకు ఆశీర్వదించబడిన మనిషి చిత్రాన్ని చూపిస్తుంది మరియు మీరు ఆ మనిషి ఎలా అవ్వగలరో సూచిస్తుంది.
ఒకరు శపించబడిన వ్యక్తి ఎలా అవుతారో చూద్దాం. యిర్మీయా 17: 5 మనకు ఇలా చెబుతుంది, ఒక మనిషి ప్రభువుపై కాకుండా 'మనిషిపై ఆధారపడితే', శపించబడిన వ్యక్తి అవుతాడు.
స్వశక్తిపై ఆధారపడువాడు కూడా శాపగ్రస్తుడు. మరో మాటలో చెప్పాలంటే, మనం ఐదవ వచనాన్ని చదువితే "నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవా మీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు" అని ఉంది.
ఈ జీవితానికి తప్పనిసరిగా రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది, మనం పూర్తిగా ప్రభువు యొక్క అనర్హమైన దయపై ఆధారపడటం మరియు విశ్వసించడం; రెండవది మన స్వప్రయత్నాలపై ఆధారపడటం మరియు విజయం కోసం శ్రమించడం.
మన స్వీయ ప్రయత్నాలను బట్టి దేవుని నుండి వచ్చు ఉన్నత విజయాన్ని మనం ఎప్పటికీ పొందలేము. మనము ఎంత కష్టపడి, శ్రమించినా, నీతిని లేక పాపక్షమాపణ సంపాదించుకోలేము. మనం సాధించగల ఏ విజయమైన పాక్షిక విజయముగానే ఉంటుంది.
మరోవైపు చూస్తే దైవికమైన విజయం మన జీవితంలోని ప్రతి కోణంలో పూర్తిగా, సంపూర్ణమైనదిగా ఉంటుంది - ప్రాణాత్మ దేహములలో! దేవుని వాక్యము ఇలా సెలవిస్తోంది, "ప్రభువు యొక్క ఆశీర్వాదం ఒకరిని ధనవంతుడిని చేస్తుంది, దానితో ఆయన దుఃఖాన్ని జోడించడు" (సామెతలు 10:22). మన వివాహాన్ని, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని త్యాగంచేయుట ద్వారా దేవుడు ఎప్పుడూ విజయం ఇవ్వడు. సంపదను పొందుకోటానికి మీ ఆరోగ్యాన్ని ఉపయోగించవద్దు; మీ ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించు కోడానికి మీ సంపద మొత్తాన్ని తరువాత ఖర్చు చేయవలసియుంటుంది!
మీ భౌతిక శరీరంలో ఆరోగ్యం మరియు సౌశీల్యత దేవుడిచ్చిన ఆశీర్వాదము. మీరు నిరంతరం తీవ్ర ఒత్తిడికి లోనౌతుంటే లేక మీ పని కారణంగా తీవ్ర భయాందోళనలకు గురయవుతుంటే, ఒక అడుగు వెనక్కి వేసి ప్రభువు సలహా తీసుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని దోచుకుంటుంది, అయితే ప్రభువు నుండి కలుగు విజయం మీ యవ్వనాన్ని పునరుద్ధరిస్తుంది.
మీరు మీ సొంత ప్రయత్నాలపై ఆధారపడినప్పుడు, మీరు చాలా సంవత్సరాలు కష్టపడిన, కొంతవరకు మాత్రమే విజయం సాధించవచ్చు. కానీ మీరు దేవుని అనర్హమైన (దయ) అనుగ్రహంపై ఆధారపడినప్పుడు, సంవత్సరాలపాటు కష్టపడినా సాధించలేని వేగవంతమైన ఆశీర్వాదాలను మరియు ప్రమోషన్‌ను మీరు తక్కువ కాలంలో అనుభవిస్తారు.
ఆదికాండము 39 లో యోసేపు కథనాన్ని చూడండి. అతను అణగారిన ఖైదీ తప్ప మరొకటి కాదు. ఫారోను కలిసిన ఒక గంటలో, అతను మొత్తం ఐగుప్తీయుల సామ్రాజ్యంలో అత్యున్నత పదోన్నతి పొందాడు. మీ జీవితంలో ఈ సమయంలో మీరు దిగజారిన స్థితిలో ఉన్నప్పటికీ (యోసేపు లాగా), మీరు దేవునిపై మీ దృష్టి పెట్టాలని ఎంచుకున్నప్పుడు ప్రభువు మిమ్మల్ని క్షణికావేశంలో అతీంద్రియంగా హెచ్చిస్తాడు.
ఆమెన్!
No comments:
Post a Comment