అపొస్తలుడైన పౌలు |
యేసు క్రీస్తుని గూర్చిన పౌలు సువార్త.
పౌలు ప్రకటించిన సువార్త ఒకటి కలదు. దానిని 'నా సువార్త' మరియు 'మా సువార్త' అని సంబోధించటానికి అతడు వెనుకాడుట లేదు.
"దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును" (రోమా 2:16)"ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసు క్రీస్తునుగూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిర పరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్." (రోమా 16:25)"మా సువార్త మరుగుచేయబడినయెడల నశించుచున్నవారి విషయములోనే మరుగు చేయబడియున్నది" (2 కొరింథీ 4:3)"ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును." (1 థెస్స 1:5)"మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను." (2 థెస్స 2:14)"నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము" (2 తిమో 2:8)
పౌలు ఒక్కాణించి ఇలా చెబుతున్నాడు, "సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పుచున్నాను. మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలు పరచుటవలననే అది నాకు లభించినది" (గలతి 1:11, 12)
పౌలు ఈ సువార్తను "దేవుని కృపాసువార్త" అని అంటున్నాడు (అపో. కా. 20:24)
అతడు నూతన నిబంధన పరిచారకుడను అని నిర్దారిస్తున్నాడు, "ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింప చేయును" (2 కొరింథీ 3:6)
➖ దేవుని కృపాసువార్త యొక్క ఏడు కోణాలు ➖
1. ఇది దేవునిపై విశ్వాసం ఉంచుటపై ఆధారపడ్డ సువార్త.
ఈ సువార్త నూతన నిబంధనపై ఆధారపడినది. ఇది పాత నిబంధన పాటించడం మీద ఆధారపడినదికాదు. ఇది కేవలం దేవునిపై విశ్వాసం (నమ్మకం) పై ఆధారపడి ఉన్నది. నీతిమంతులుగా లెక్కించబడటానికి ధర్మశాస్త్రము పాటించాల్సినది ఏదైనా వేరొక సువార్తగా పరిగణించబడుతుంది మరియు వాస్తవానికి అది సువార్తే కాదు - గలతి 1: 6-7.
క్రియల మూలమైన సువార్తను బోధించువాడు శపించబడును, దానిని బోధించేది దేవదూత అయినా (వ 8, 9).
అంతేగాక పౌలు ఇలా అడుగుతున్నాడు, "మనుషులను సంతోషపెట్ట చూస్తున్నానా"? (వ 10). అందరికి అంగీకారయోగ్యమైన మరియు ఆకర్షణీయమైన సువార్తను నేను బోధించుచున్నానా? కానీ ఇలా దృవీకరిస్తున్నాడు, " మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది"
గలతి 3 లో - పౌలు ఇలా వివరిస్తున్నాడు, " దేవుని యందలి విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతునిగా తీర్చబడిన అబ్రాహాముకువలె (వ. 6) మనము కూడా విశ్వాసం (నమ్మిక) ద్వారా నీతిమంతులముగా తీర్చబడుచున్నాము (వ.11).
అంతేగాక, "విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతోకూడ ఆశీర్వదింపబడుదురు" (వ. 9)
మరియు, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా – ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధు లన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు (వ.10)
ఇదే క్రమంలో యాకోబు ఇలా వ్రాసాడు, "ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక్క ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును" (యాకోబు 2:10)
చివరిగా, కృపచేత విశ్వాసముద్వారా మనము రక్షింపబడుచున్నాము. ఇది దేవుని ఆలోచన గనుక, మనము విశ్వసించినంత కాలం ఏది దేవుని ఉద్దేశాన్ని పాడు చేయలేదు.
తదుపరి వ్యాసంలో కొనసాగుతుంది . . . . . . . . . . . . . . . .
No comments:
Post a Comment