Saturday, August 15, 2020

యేసు క్రీస్తుని గూర్చిన పౌలు సువార్త - ఐదవ భాగం

 

నాల్గవ భాగం నుండి కొనసాగింది...............................


అపొస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్త విశ్వాసం, క్రొత్త నిబంధన, దత్తపుత్రత్వము మరియు సయోధ్యపై ఆధారపడి ఉందని మనం ఇప్పటివరకు చూశాము.

మనమిప్పుడు అపొస్తలుడైన పౌలు సువార్త యొక్క ఐదవ అంశానికి వచ్చాము.


5. ఇది ప్రాయశ్చితంపై (శాంతికరము - కరుణాధారము) ఆధారపడిన సువార్త

ప్రాయశ్చిత్తము అనేది దేవున్ని శాంతింపజేయడం లేదా ప్రసన్నం చేసుకోవడం; దైవిక అనుగ్రహం పొందుకొనుటకైనా లేదా దైవిక ప్రతీకారం నుండి తప్పించుకోవడానికైనా. ఈ పదం బైబిల్లో 3 సార్లు మాత్రమే ప్రస్తావించబడింది.

రోమా 3:24-26 - "కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.  పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను"

1 యోహాను 2:22 - "ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు"

1 యోహాను 4:10 - "మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది"

మనము (ఆదాములో) పాపం చేసినప్పుడు, దేవుడు చాలా కోపగించుకొన్నాడు.  ఆయనతో తిరిగి సత్సంబంధాలు కలిగియుండుటకు మనము మన పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసు కోవలసియుండెను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తునందున, మన అవిధేయతను చూసి చూడనట్లు విడిచిపెట్టుటకు ఆయన నీతి స్వభావం అనుమతించదు. మరోవైపు, కోపంగా ఉన్న దేవుణ్ణి మనం ఎప్పటికీ ప్రసన్నం చేసుకోలేము. కాబట్టి, మనము నిస్సహాయంగా మిగిలి పోయాము.

సహాయము చేయటానికి వచ్చిన దేవునికి కృతజ్ఞతలు. దైవిక న్యాయం సంతృప్తి చెందడానికి మరియు మనం మరోసారి ఆయనతో రాజీపడటానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును మన ప్రాయశ్చిత్తంగా పంపాడు. దైవిక న్యాయం సంతృప్తి పరచడానికి మరియు పాపాత్మకమైన మనిషిపై దేవుని కోపాన్ని చల్లార్చడానికి యేసు రక్తం చిందించబడింది.

కాబట్టి, శుభవార్త ఏమిటంటే, యేసు రక్తం ద్వారా దేవుని పవిత్ర సన్నిధిలోనికి ప్రవేశించడానికి మనకు ఇప్పుడు ధైర్యం ఉంది.  

గుర్తుంచుకోండి, దేవునికి దగ్గరవుచున్నకొలది పాపానికి దూరం అవుతాము. 

పాపము మానవుని భయపెట్టి దేవుని సన్నిధినుండి దాగుకొనట్లు చేసింది; కానీ యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఉచిత వరమైన ఆయన నీతి వలన దేవుని సన్నిధిలో  నిర్భయంగా, క్షమించబడిన స్థితిలో నిలవటానికి సహాయపడింది.  ఆయన మొదట మనల్ని ప్రేమించెను, గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము.  ఇది కదా సువార్త.  


...................కొనసాగనైయుంది. 

Thursday, August 13, 2020

యేసుక్రీస్తుని గూర్చిన పౌలు సువార్త - నాల్గవ భాగం



మూడొవ భాగం నుండి . . . . . . . . .


పౌలు ప్రకటించిన సువార్త - విశ్వాసము, క్రొత్త నిబంధన మరియు సయోధ్యపై ఆధారపడి ఉందని మనం ఇప్పటివరకు చూశాము.  మనమిప్పుడు అపొస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్త యొక్క నాల్గవ కోణానికి వచ్చాము.

4. ఈ సువార్త దత్తపుత్రత్వ ఆధారమైనది. 


2 కొరింథీయులకు 5:18 లో దేవుడు మానవునితో రాజీపడుట అను ఆలోచనను అనుసరించి, పౌలు 2 కొరింథీయులకు 6:18 లో ఇలా అన్నాడు, " మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు." మనము దేవునిచేత దత్తతు తీసుకొనబడ్డాము.  ఇది మనకు శుభవార్త.  

రోమా 8:14-16 లో ఇలా ఉంది "దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.  ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను8:15 లేక–స్వీకృతపుత్రాత్మ. పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము – అబ్బా తండ్రీ అని మొఱ్ఱ పెట్టుచున్నాము.  మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు."

దేవుడు మనలను తన కుమారులు, కుమార్తెలుగా స్వీకరించాడు మరియు దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలవాలని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. అరామిక్ హిబ్రూ పదం 'అబ్బా'ని అనువదించ కూడదని అనువాదకులు ఎంచుకున్నారు.  ఇది మనకు మేలైయింది; ఎందుకంటే ఆధునిక హీబ్రూలో 'అబ్బా' అంటే 'డాడీ' అని అర్ధము. ఇది సాన్నిహిత్యం మరియు అన్యోన్యత యొక్క భావాన్ని మనకు సూచిస్తుంది. మనము దేవునితో ఇంత సన్నిహితంగా ఉండవచ్చని గ్రహింప జేస్తుంది. పరిశుద్ధాత్మ కూడా ఈ వాస్తవానికి సాక్ష్యమిస్తున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనం నిజంగా దేవుని పిల్లలు అని ధృవీకరిస్తుంది.

మరొక రకంగా చెప్పాలంటే, మనం యేసుక్రీస్తుకు సోదరులు అవుతాము. ఆశ్చర్యపోకండి!   - దయచేసి రోమా 8:29 చదవండి, "ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను."  అతను మొదటి సంతానం అయితే, తిరిగి జన్మించిన మనం అయన తమ్ముళ్ళము కదా.

పౌలు అదే సత్యాన్ని గలతీయ సంఘానికి వివరిస్తున్నాడు, "అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మ శాస్త్రమునకు లోబడినవాడాయెను. మరియు మీరు కుమారులై    యున్నందున (అబ్బా) నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.  కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు" గలతి 4:4-7. 

మనము నియమాలను (ధర్మశాస్త్రము) పాటించాల్సిన దాసులము కాము; మనము  కుమారులము మరియు దేవుని వారసులముగా నడుస్తాము.  ఆయనను పోలి ఉంటాము. 

ఏది ఏమైనా దత్తత ప్రక్రియలో శాశ్వత భావన ఉంటుంది. గుర్తుంచుకోండి, మనల్ని ఈ రోజు దత్తత తీసుకొని మరల రేపు నిరాకరించడు. మన తండ్రి మనల్ని క్రమశిక్షణలో పెట్టవచ్చునేమోకాని ఆయన మనలను ఎన్నటికీ విడిచిపెట్టడు. ఇది మనము వినాల్సిన మరియు ప్రకటించాల్సిన సువార్త.  


Wednesday, August 12, 2020

THE GOSPEL ACCORDING TO APOSTLE PAUL - Part 4


 

We have seen so far that the Gospel of Paul was based on Faith, the New Covenant and Reconciliation.

Now we come to the fourth aspect of the gospel according to Apostle Paul.

4.       IT IS A GOSPEL BASED ON ADOPTION

Following the thought of being reconciled to God in 2 Corinthians 5:18, Paul continues in 2 Corinthians 6:18 saying, “And will be a Father unto you, and ye shall be my sons and daughters, saith the Lord Almighty.”  We are adopted by God and that is good news.

We see in Romans 8:14–16 – “For as many as are led by the Spirit of God, they are the sons of God.  For ye have not received the spirit of bondage again to fear; but ye have received the Spirit of adoption, whereby we cry, Abba, Father.  The Spirit itself beareth witness with our spirit, that we are the children of God:

God has adopted us to be His sons and daughters and Paul encourages us to call God as Abba Father.  The translators chose not to translate the Aramaic Hebrew word ‘Abba’, because in Modern Hebrew ‘Abba’ means Daddy.  So, we see a sense of intimacy and closeness.  Even Holy Spirit bears witness to this fact.  Holy Spirit in us affirms that we are indeed the children of God.

In another sense, we become brothers to Jesus Christ.  Don’t be surprised when I say that – please read Rom 8:29 – “For whom he did foreknow, he also did predestinate to be conformed to the image of his Son, that he might be the firstborn among many brethren”.  If he was the firstborn then we who are born again are his 'brothers'.

Paul repeats the same truth to the Galatian Church – “But when the fulness of the time was come, God sent forth his Son, made of a woman, made under the law, To redeem them that were under the law, that we might receive the adoption of sons.  And because ye are sons, God hath sent forth the Spirit of his Son into your hearts, crying, Abba, Father. Wherefore thou art no more a servant, but a son; and if a son, then an heir of God through Christ.” (Galatians 4:4-7)

We are no more servants that are required to keep rules (the law); we are sons and we walk as heirs of God.  This consciousness changes the way we think, which will in turn change the way we live.  

Right thinking leads to right living.

There is a sense of permanence in any adoption process.  Remember, you cannot be adopted today and abandoned tomorrow.  Our Father may discipline us but will never disown us.  That is good news!


to be continued.............

Friday, August 7, 2020

THE GOSPEL ACCORDING TO APOSTLE PAUL - Part 3

Continued from Part 2……………

Apostle Paul


We have so far seen that the Gospel of Paul was based on Faith in God and The New Covenant.

Now we come to the third aspect of the gospel according to Apostle Paul.

3.       IT IS A GOSPEL BASED ON RECONCILIATION:

Reconciliation means making peace, restoration or reuniting.  Paul expresses the thought of God taking the initiative to be reunited to the world; to be restored back with man – “God was in Christ, reconciling the world unto Himself, not imputing their trespasses unto them” (2 Cor 5:19).  In the garden of Eden, it was Adam that hid himself from God; while God came looking out for him.

We cannot be reconciled with someone if we continue to blame them or raise accusations against them or issue ‘show cause’ notices to them.  In the same way, God cannot reconcile the world to Himself if he is still holding anger and grudge against it.  

Therefore, God in Christ took the blame and punishment for our sins and instead of raising an accusation against us or seeking for an explanation for our behavior is now saying, “Okay, I myself took the punishment, I took the blame;  you don’t have to be punished again.  I drop all charges against you.  I set you free.  I will not take into account any of your wrongdoing.”

God could do this because a crime can be punished for, only once.  God's wrath against man was satisfied when Christ took our place and suffered on the cross.

Imputing is to attribute, to attach or to credit.  It is an accounting term.  The discrepancy in God’s account journal was corrected, once and for all.  God is not imputing our sins on us.  Instead he put our sins on His son.

Reconciliation - God did by taking the sins of all humans – past, present and future – and laying them upon His son Jesus Christ and in return taking the righteousness of Jesus Christ and laying it upon us.  We are now clothed with Christ’s righteousness.  And God looks upon us He sees Jesus.  God loves us in the same way He loves Jesus (John 17:23).  This was divine exchange or divine reconciliation.

God made “Him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.” 2 Cor 5:21).

Jesus Christ became sin without committing any sin and we became righteous without doing anything right.

Paul affirms that “he that hath wrought us for the selfsame thing is God, who also hath given unto us the earnest of the Spirit” (2 Cor 5:5). 

The work of reconciliation was done by God Himself who also confirmed the transaction by giving us Holy Spirit.  Holy Spirit is endorsing the same when it is said, “The Spirit itself beareth witness with our spirit, that we are the children of God” (Rom 8:16).

In order to guarantee that this transaction of divine exchange between God and man was final and binding, He sent Holy Spirit to us as a ‘down payment’ or an ‘imprest amount’ which was proof that we hereafter belong to God forever.

Eph 1: 13, 14 - In whom ye also trusted, after that ye heard the word of truth, the gospel of your salvation: in whom also after that ye believed, ye were sealed with that Holy Spirit of promise, which is the earnest of our inheritance until the redemption of the purchased possession, unto the praise of his glory.

2 Cor 1:22 - Who hath also sealed us, and given the earnest of the Spirit in our hearts.

Notice the sense of permanence in this transaction between God and man.  If we call upon the name of the Lord Jesus Christ and recognize that His death was for our reconciliation to God, we become the righteousness of God of God and belong to God forever. Now, that is good news!

To be continued.................


యేసు క్రీస్తుని గూర్చిన పౌలు సువార్త - మూడోవ భాగం

రెండొవ భాగం నుండి కొనసాగింది .............

అపొస్తలుడైన పౌలు 



మనం ఇప్పటివరకు పౌలు యొక్క సువార్త దేవునిపై విశ్వాసం మరియు క్రొత్త నిబంధనపై ఆధారపడి ఉందని చూశాము.  ఇప్పుడు మూడోవ అంశాన్ని చూద్దాము. 

3. అది సమాధానపరచుటపై (సయోధ్య) ఆధార పడియున్న సువార్త:

సయోధ్య అంటే పునరుద్ధరణ లేదా తిరిగి కలవడం. లోకమును తిరిగి ఆయనతో కలుపుకోవడానికి దేవుడు చొరవ తీసుకుంటున్న ఆలోచనను పౌలు ఇక్కడ  వ్యక్తపరుస్తాడు; మానవునితో సంబంధాలు తిరిగి పునరుద్ధరించు కోవాలని దేవుని ప్రయత్నాం.  "అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద (impute) మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు..........." - (2 కొరింథీ 5:19).  ఏదెను తోటలో పాపం చేసిన ఆదాము దేవునికి దూరంగా వెళ్లి దాగుకొన్నాడు కానీ దేవుడు తనను వెదుకుతూ తన వెంట వచ్చాడు. 
మనము ఎవరినైనా నిందిస్తూ లేదా వారిపై ఆరోపణలు చేస్తూ వారితో (సమాధాన పడలేము) రాజీపడలేము.
అందువల్ల, క్రీస్తులో దేవుడు మన పాపాలకు నిందను మరియు శిక్షను తనపై వేసుకున్నాడు.  అంతేగాక మనపై ఆరోపణలు చేయకుండా లేక మన ప్రవర్తనకు సంజహిషి కోరకుండా ఇప్పుడు "నేను స్వయంగా మీ  శిక్షను  తీసుకున్నాను, నేను మీ నిందను తీసుకున్నాను; కాబట్టి మీరు ఇప్పుడు నిరపరాధులు.  మీ తప్పిదములు నేను లెక్కకు తీసుకొనుటలేదు మిమల్ని శిక్షించాల్సిన అవసరం నాకిక లేదు. నేను మీపై అన్ని ఆరోపణలను విరమించుకుంటున్నాను.అని చెబుతున్నాడు.   దేవుడు దీన్ని చేయగలడు ఎందుకంటే ఒక నేరానికి ఒక్కసారి మాత్రమే శిక్షించవచ్చును - ఆ శిక్షను ఆయన పొందాడు. 

'మోపక' (Impute) అంటే లెక్కకు తీసుకొనుట. ఇది ఒక అకౌంటింగ్ పదం. దేవుని ఖాతా పత్రికలోని వ్యత్యాసం ఒక్కసారిగా సరిదిద్దబడింది. మన రుణాన్ని ఆయన తీర్చి బాకీని కొట్టివేసాడు. సమాధానపరచుట అనగా భూత, వర్తమాన మరియు భవిష్యత్ మానవులందరి పాపాలను తీసుకొని, తన కుమారుడైన యేసు క్రీస్తుపై వేయుట  మరియు యేసు క్రీస్తు నీతిని తీసుకొని మనపై వేయుట. మానవునిపై నేరారోపణ  కొట్టివేయుట. 
మనము ఇప్పుడు క్రీస్తు నీతిని ధరించుకొన్నాము. దేవుడు తన కుమారుని చూసే విధంగా మనలను చూస్తున్నాడు.  దేవుడు యేసును ప్రేమిస్తున్నట్లే మనలను ప్రేమిస్తున్నాడు (యోహాను 17:23). ఇది ఒక దైవిక మార్పిడి లేదా దైవిక సయోధ్య.
"దేవుడు మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను" (2 కొరింథీ 5:21)
యేసు క్రీస్తు ఏ పాపమూ చేయకుండా పాపం అయ్యాడు మరియు మనం ఏ నీతికార్యం చేయకుండా నీతిమంతులం అయ్యాము.
పౌలు దానిని ఇలా ధృవీకరించాడు "దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మఅను సంచకరువును (ముందస్తు చెల్లింపు)  మనకనుగ్రహించియున్నాడు" (2 కొరింథీ 5:5)
సయోధ్య కార్యాన్ని దేవుడు స్వయంగా చేసాడు, ఆయన మనకి పరిశుద్దాత్మను  ఇవ్వడం ద్వారా లావాదేవీని ధృవీకరించాడు. పరిశుద్దాత్ముడు దీనిని వేరొక చోట ఇలా నిర్దారిస్తున్నాడు, "మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు" (రోమా 8:16)
దేవునికి మరియు మానవునికి మధ్య జరిగిన దైవిక మార్పిడి ఖచ్చితమైనదని రుజువుపరచుటకు దేవుడు పరిశుద్దాత్ముని సంచకరువుగా లేక ముందస్తు చెల్లింపుగా ఇచ్చాడు.  మనమికనుండి శాశ్వితంగా దేవుని సొత్తు అని చెప్పటానికి ఇదే సాక్షము. పరిశుద్దాత్మ యందు ముద్రింపబడియున్నారు (ఎఫె 4:30) 
"మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా (ముందస్తు చెల్లింపు) ఉన్నాడు." (ఎఫిసీ 1:13-14)
"ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు" (2 కొరింథీ 1:22)

దేవుడు మరియు మానవుని మధ్య ఈ లావాదేవీలో శాశ్వత భావాన్ని గమనించండి. మనము ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధించి, ఆయన మరణం దేవునితో మన సయోధ్య కోసమని గుర్తించినట్లయితే, మనం దేవుని నీతిగా మారి, ఎప్పటికీ దేవునికి చెందినవాళ్ళమే.  ఇది కదా శుభవార్త!





Monday, August 3, 2020

యేసుక్రీస్తుని గూర్చిన పౌలు సువార్త - రెండొవ భాగము

Continued....................................

అపొస్తలుడైన పౌలు 


మన పూర్వీకుడైన అబ్రాహాము మాదిరిగానే మనుష్యులను నీతిమంతులుగా పరిగణించవచ్చనే సువార్తను పౌలు బోధించాడని మనం ఇంతకుముందు చూశాము.
ఒక ప్రముఖ ఉదాహరణ కొర్నేలియస్ అనే అన్యజనుడు.  పేతురు అతని గురించి ఇలా అన్నాడు "దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.  ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును" (అపో. కా. 10:34-35)
కొర్నెలి దైవభీతి గలవాడు.  అది అతనికి నీతిగా ఎంచబడింది.  మరియు దేవుడు తనను అంగీకరించెను.  అతడు కృపాసువార్తను వినగానే, "పరిశుద్ధాత్మ వారిపై దిగెను" (అపో. కా. 10:44). 
అతని మార్పును గూర్చి తదుపరి యెరూషలేము పెద్దలు ఇలా వ్యాఖ్యానించారు, "అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి."
కొర్నెలి దేవునియందు నమ్మికయుంచెను; అది మారుమనస్సుగా లెక్కింపబడెను.  నిజంగా అతడు విశ్వసించుట తప్ప మరేమి చేయలేదు.  గమనించండి, మారుమనస్సు అంటే కేవలం మనస్సు మారుట, అంతేగాని ఇలా చెయ్యాలి, అలా చేయకూడదు అని చెప్పే నియమావళి కాదు.  
కాబట్టి పౌలు ఇలా అంటున్నాడు, "అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.  ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును." (రోమా 10:9-10)  మరియు "ఎందుకనగా – ప్రభువు  నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును". (రోమా 10:13)

మనమిప్పుడు పౌలు సువార్తయొక్క రెండొవ కోణం చూద్దాము. 

2.  ఈ సువార్త నూతన నిబంధనపై ఆధారపడియుంది. 


ఈ సువార్త పరిశుద్దాత్ముని వలన అందించబడింది, "అక్షరము మూలమైనది కాదు, ఆత్మవలనైనది." (2 కొరింథీ 3:6)
ఈ మరణ కారణమగు పరిచర్య, (తగ్గిపోవు మహిమగలదైనను) ఆత్మసంబంధమైన పరిచర్య (ఎంతో మహిమగలదై) చేత భర్తీ చేయబడెను. (వ. 7-8)
పౌలు మరింత వివరిస్తూ, "శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమకలదగును.  అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.  తగ్గిపోవునదే మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా". (వ. 9-11)

ఈ సువార్త, యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవుడు మానవునితో చేసుకొన్న నూతన నిబంధనపై ఆధారపడి నీతిని (అనగా దేవుని ఎదుట నిలువగలుగు స్థితిని) అనుగ్రహిస్తుంది. 
  • ఈ నూతన నిబంధన - ధర్మశాస్త్రవిధులు వ్రాయబడిన హృదయాన్ని మనకిచ్చింది. 
  • ఈ నూతన నిబంధన - దేవుడు మన పాపములు మరియు అతిక్రమములు జ్ఞాపకముంచుకొనడు అనే నిశ్చయత మనకిచ్చింది. 
  • ఈ నూతన నిబంధన - పాపబలియర్పణలనుండి మనల్ని విడిపించింది.  క్షమాపణ పొందుకొనుటకు మనమిక ఏమి చేయనక్కరలేదు - బలులైన లేక మనల్ని మనము నలుగగొట్టుకోనుటయైన.
  • ఈ నూతన నిబంధన - యేసు రక్తము ద్వారా సాక్షాత్తు దేవుని సన్నిధిలోకి  ప్రవేశించే ధైర్యాన్ని ఇచ్చింది. 
  • ఈ నూతన నిబంధన - దేవుడు మనల్ని తిరస్కరిపంపక అంగీకరిస్తాడని పూర్ణ నిశ్చయత మనకిచ్చింది. 
  • ఈ నూతన నిబంధన - మనకు మంచి మనసాక్షిని ఇచ్చింది. 
  • ఈ నూతన నిబంధన - స్వచ్ఛమైన నీళ్లతో కడగబడిన దేహాన్ని ఇచ్చింది. 
మనము పై సత్యములను తొట్రిల్లక గట్టిగ చేపట్టాలి.  మన నోటితో ఈ వాస్తవాలను తరచూ ఒప్పుకొంటూ ఉండాలి; ఎందుకంటే క్రీస్తు యాగము సరిపోదని, విరోధి మనతో చెప్పజూస్తాడు.  మనల్ని క్షమించుట కష్టమని చెబుతాడు.  మన ప్రభువైన యేసుక్రీస్తు బలియాగాన్ని చులకన చేయటం, తక్కువ చేయటం వాడి పని.   

ఒక సారి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం, 16-23 వచనాలు చదవండి. ఈ నిబంధన గూర్చి పరిశుద్దాత్ముడు యిర్మీయా ద్వారా క్రీస్తు పూర్వము 650 ఏళ్ళ క్రితమే మనకు తెలియజేసాడు;  మన పాపములు ఇక ఏనాటికి గుర్తుంచుకొనడని ఆయన హామీ ఇచ్చాడు.  (యిర్మీయా 31:31-34). 

కాబట్టి నూతన నిబంధనలో ఎంతో నిరీక్షణ ఉంది. మనమిప్పుడు దేవుని మహిమను  ముఖాముఖి చూస్తూ ఆయన పోలికచొప్పున మారేదము.  యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనిషితో చేసిన ఒడంబడికలోని శాశ్వతతను గమనించండి. మన పాపాలు శాశ్వతంగా క్షమించబడ్డాయి మరియు మరలా గుర్తుండవు.


to be continued......................

Saturday, August 1, 2020

THE GOSPEL ACCORDING TO APOSTLE PAUL - Part 2

Apostle Paul in prison

Continued from Part 1……………………

We have earlier seen that Paul preached the good news that man could be counted righteous and be saved by faith in God just like Abraham our forefather.

A prominent example is the case of Cornelius a Gentile.   Peter said of him, “…………of a truth I perceive that God is no respecter of persons: But in every nation he that feareth him, and worketh righteousness, is accepted with him.”  (Acts 10:34-35)

Cornelius had a fear for God which was considered righteous and God accepted him.  When he heard the gospel of grace, “the Holy Ghost fell on all them which heard the word”.  (Acts 10:44)

His conversion to Christ was later commented upon by the elders in Jerusalem as:  When they heard these things, they held their peace, and glorified God, saying, then hath God also to the Gentiles granted repentance unto life.” (Acts 11:18)

Cornelius believed in God and it was counted as repentance.  Truly, he did nothing but believe, to get saved.  Take note, repentance simply means ‘change of mind’ and not a set of do’s and don’ts.

Therefore, Paul says “That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved.  Because with the heart man believeth unto righteousness; and with the mouth confession is made unto salvation” (Romans 10:9-10.) and “......whosoever shall call upon the name of the Lord shall be saved” (Romans 10:13).

We will now see to the second aspect of the Gospel of Paul.

2.       IT IS A GOSPEL BASED ON THE NEW COVENANT:

This gospel is a ministration of the Holy Spirit which is “not of the letter, but of the spirit: …………” (2 Cor 3:6). 

It replaced “the ministration of death…..which glory was to be done away” (vs.7) with “the ministration of the spirit” which was even more glorious.

Paul further explains that “if the ministration of condemnation be glory, much more doth the ministration of righteousness exceed in glory, for even that which was made glorious had no glory in this respect, by reason of the glory that excelleth; for if that which is done away was glorious, much more that which remaineth is glorious(2 Cor 3:9-11).  

This gospel offers us righteousness (the right to stand before God) based on the new covenant that God made with man through the blood of Jesus Christ.

  • This new covenant gave us a heart and mind with the laws of God written on them.
  • This new covenant gave us the assurance that God would remember our sins and iniquities no more.
  • This new covenant freed us from further offerings for sin.  We are not required to do anything to secure forgiveness – sacrifices or self-infliction.
  • This new covenant gave us boldness to enter the very presence of God through the blood of Jesus.
  • This new covenant provided for us to draw near to God with full assurance that He would receive us and not reject us.
  • This new covenant gave us a good conscience.
  • This new covenant gave us bodies washed with pure water.

We need to hold tight to the profession (confession) of the above truths without wavering.  We need to keep confessing these facts with our mouth regularly because the enemy would want to tell us that the sacrifice of Christ is not enough and that we couldn’t possibly be forgiven.  It is the work of the evil one to demean and undermine the sacrifice of our Lord Jesus Christ.

Hebrews 10:16-23 – “This is the covenant that I will make with them after those days, saith the Lord, I will put my laws into their hearts, and in their minds will I write them; And their sins and iniquities will I remember no more.  Now where remission of these is, there is no more offering for sin.

Having therefore, brethren, boldness to enter into the holiest by the blood of Jesus, by a new and living way, which he hath consecrated for us, through the veil, that is to say, his flesh; 

And having a high priest over the house of God; let us draw near with a true heart in full assurance of faith, having our hearts sprinkled from an evil conscience, and our bodies washed with pure water.

Let us hold fast the profession of our faith without wavering; (for he is faithful that promised).

This agreement was foretold by Holy Spirit through Jeremiah 650 years before Christ in which He assured that He would not remember our sins anymore (Jeremiah 31:31-34).  

Therefore, there is much hope and expectation in the Gospel of the New Covenant.  Notice the permanence in the covenant that God made with man through Jesus Christ.  Our sins are permanently forgiven and never remembered again. 

............................to be continued


Thursday, July 30, 2020

యేసు క్రీస్తుని గూర్చిన పౌలు సువార్త - మొదటి భాగం

అపొస్తలుడైన పౌలు 


యేసు క్రీస్తుని గూర్చిన పౌలు సువార్త.

పౌలు ప్రకటించిన సువార్త ఒకటి కలదు.  దానిని 'నా సువార్త' మరియు 'మా సువార్త' అని సంబోధించటానికి అతడు వెనుకాడుట లేదు. 

"దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును" (రోమా 2:16)

"ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసు క్రీస్తునుగూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిర పరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్." (రోమా 16:25)

"మా సువార్త మరుగుచేయబడినయెడల నశించుచున్నవారి విషయములోనే మరుగు చేయబడియున్నది" (2 కొరింథీ 4:3)

"ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును." (1 థెస్స 1:5)

"మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను." (2 థెస్స 2:14)

"నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము" (2 తిమో 2:8)

పౌలు ఒక్కాణించి ఇలా చెబుతున్నాడు, "సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పుచున్నాను.  మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలు పరచుటవలననే అది నాకు లభించినది" (గలతి 1:11, 12)

పౌలు ఈ సువార్తను "దేవుని కృపాసువార్తఅని అంటున్నాడు (అపో. కా. 20:24)

అతడు నూతన నిబంధన పరిచారకుడను అని నిర్దారిస్తున్నాడు, "ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింప చేయును" (2 కొరింథీ 3:6)

దేవుని కృపాసువార్త యొక్క ఏడు కోణాలు


1. ఇది దేవునిపై విశ్వాసం ఉంచుటపై ఆధారపడ్డ సువార్త.

ఈ సువార్త నూతన నిబంధనపై ఆధారపడినది.  ఇది పాత నిబంధన పాటించడం మీద ఆధారపడినదికాదు. ఇది కేవలం దేవునిపై విశ్వాసం (నమ్మకం) పై ఆధారపడి ఉన్నది.  నీతిమంతులుగా లెక్కించబడటానికి ధర్మశాస్త్రము పాటించాల్సినది  ఏదైనా వేరొక సువార్తగా పరిగణించబడుతుంది మరియు వాస్తవానికి అది సువార్తే కాదు - గలతి 1: 6-7. 
క్రియల మూలమైన సువార్తను బోధించువాడు శపించబడును, దానిని బోధించేది  దేవదూత అయినా (వ 8, 9). 

అంతేగాక పౌలు ఇలా అడుగుతున్నాడు, "మనుషులను సంతోషపెట్ట చూస్తున్నానా"? (వ 10). అందరికి అంగీకారయోగ్యమైన మరియు ఆకర్షణీయమైన సువార్తను నేను బోధించుచున్నానా?  కానీ ఇలా దృవీకరిస్తున్నాడు, " మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది"

గలతి 3 లో - పౌలు ఇలా వివరిస్తున్నాడు, " దేవుని యందలి విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతునిగా తీర్చబడిన అబ్రాహాముకువలె (వ. 6) మనము కూడా విశ్వాసం (నమ్మిక) ద్వారా నీతిమంతులముగా తీర్చబడుచున్నాము (వ.11). 
అంతేగాక, "విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతోకూడ ఆశీర్వదింపబడుదురు" (వ. 9)

మరియు, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా – ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధు లన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు (వ.10)

ఇదే క్రమంలో యాకోబు ఇలా వ్రాసాడు, "ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక్క ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును" (యాకోబు 2:10)

చివరిగా, కృపచేత విశ్వాసముద్వారా మనము రక్షింపబడుచున్నాము.  ఇది దేవుని ఆలోచన గనుక, మనము విశ్వసించినంత కాలం ఏది దేవుని ఉద్దేశాన్ని పాడు చేయలేదు. 


తదుపరి వ్యాసంలో కొనసాగుతుంది . . . . . . . . . . . . . . . .  




THE GOSPEL ACCORDING TO APOSTLE PAUL - Part 1

Apostle Paul

THE GOSPEL ACCORDING TO APOSTLE PAUL

 

There is a gospel according to Apostle Paul which he preached and he is not apologetic about saying ‘my gospel’ or ‘our gospel’. 

 

Romans 2:16 – “In the day when God shall judge the secrets of men by Jesus Christ according to my gospel.”

 

Romans 16:25 – “Now to him that is of power to stablish you according to my gospel, and the preaching of Jesus Christ, according to the revelation of the mystery, which was kept secret since the world began…………”

 

2 Corinthians 4:3 – “But if our gospel be hid, it is hid to them that are lost.”

 

1 Thessalonians 1:5 – “For our gospel came not unto you in word only, but also in power, and in the Holy Ghost, and in much assurance; as ye know what manner of men we were among you for your sake.”

 

2 Thessalonians 2:14 – “Whereunto he called you by our gospel, to the obtaining of the glory of our Lord Jesus Christ.”

 

2 Timothy 2:8 – “Remember that Jesus Christ of the seed of David was raised from the dead according to my gospel:”

 

Paul further asserts, “I certify you, brethren that the gospel which was preached of me is not after man.  For I neither received it of man, neither was I taught it, but by the revelation of Jesus Christ.”  (Galatians 1:11-12).

Paul calls his gospel ‘the gospel of the grace (unmerited favour) of God’.  (Acts 20:24).

He declares that he is made a minister of the New Testament.  “Who also hath made us able ministers of the New Testament; not of the letter, but of the spirit: for the letter killeth, but the spirit giveth life  (2 Corinthians 3:6).

 

SEVEN ASPECTS OF THE GOSPEL OF THE GRACE OF GOD

 

1.        IT IS A GOSPEL BASED ON FAITH IN GOD:

This gospel is based on the New Covenant of God.  It is not dependent on keeping the law of the Old Covenant.  It is based solely on faith (belief) in God.

Any gospel that requires the keeping of the law in order to be justified and counted righteous is considered ‘another’ gospel and in fact not the gospel at all  (Galatians 1:6-7).

Cursed is he who preaches a gospel of works, even if it were an angel that was preaching it  (vs.8, 9).

Paul even asks us, “…..do I seek to please men?” (vs. 10) for preaching an acceptable gospel, that would attract people to believe.

But then he certifies, “……that the gospel which was preached……is not after man; (vs.11) …neither received it of man,……….. but by the revelation of Jesus Christ.” (vs.12)

In Galatians 3 – Paul explains that, just like Abraham believed God, and it was accounted to him for righteousness, (vs. 6) we too are justified (considered righteous) by (belief) faith – (vs. 11).

He continues “they which be of faith are blessed with faithful Abraham” (vs.9)

And those “that are of the works of the law are under the cursebecause no one can ever continue in all things that are written in the book of the law (vs.10)

James writes in the same vein “For whosoever shall keep the whole law, and yet offend in one point, he is guilty of all.” (James 2:10).

Finally, “by grace are ye saved through faith” (Ephesians 2:10).

Since it is God that has taken the initiative to save us, and begun this good work, He will perform it till the day of Jesus Christ.  As long as we believe, there is nothing that can ruin God's intent.

 

To be continued………………………………….


WHAT IS THE BETTER PART?

Jesus, Mary and Martha Recently, I was conversing with a family friend and referred to her dear husband as her 'darling'.  She immed...