Continued....................................
మన పూర్వీకుడైన అబ్రాహాము మాదిరిగానే మనుష్యులను నీతిమంతులుగా పరిగణించవచ్చనే సువార్తను పౌలు బోధించాడని మనం ఇంతకుముందు చూశాము.
ఒక ప్రముఖ ఉదాహరణ కొర్నేలియస్ అనే అన్యజనుడు. పేతురు అతని గురించి ఇలా అన్నాడు "దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును" (అపో. కా. 10:34-35)
కొర్నెలి దైవభీతి గలవాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. మరియు దేవుడు తనను అంగీకరించెను. అతడు కృపాసువార్తను వినగానే, "పరిశుద్ధాత్మ వారిపై దిగెను" (అపో. కా. 10:44).
అతని మార్పును గూర్చి తదుపరి యెరూషలేము పెద్దలు ఇలా వ్యాఖ్యానించారు, "అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి."
కొర్నెలి దేవునియందు నమ్మికయుంచెను; అది మారుమనస్సుగా లెక్కింపబడెను. నిజంగా అతడు విశ్వసించుట తప్ప మరేమి చేయలేదు. గమనించండి, మారుమనస్సు అంటే కేవలం మనస్సు మారుట, అంతేగాని ఇలా చెయ్యాలి, అలా చేయకూడదు అని చెప్పే నియమావళి కాదు.
కాబట్టి పౌలు ఇలా అంటున్నాడు, "అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును." (రోమా 10:9-10) మరియు "ఎందుకనగా – ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును". (రోమా 10:13)
మనమిప్పుడు పౌలు సువార్తయొక్క రెండొవ కోణం చూద్దాము.
2. ఈ సువార్త నూతన నిబంధనపై ఆధారపడియుంది.
ఈ సువార్త పరిశుద్దాత్ముని వలన అందించబడింది, "అక్షరము మూలమైనది కాదు, ఆత్మవలనైనది." (2 కొరింథీ 3:6)
ఈ మరణ కారణమగు పరిచర్య, (తగ్గిపోవు మహిమగలదైనను) ఆత్మసంబంధమైన పరిచర్య (ఎంతో మహిమగలదై) చేత భర్తీ చేయబడెను. (వ. 7-8)
పౌలు మరింత వివరిస్తూ, "శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమకలదగును. అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను. తగ్గిపోవునదే మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా". (వ. 9-11)
ఈ సువార్త, యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవుడు మానవునితో చేసుకొన్న నూతన నిబంధనపై ఆధారపడి నీతిని (అనగా దేవుని ఎదుట నిలువగలుగు స్థితిని) అనుగ్రహిస్తుంది.
- ఈ నూతన నిబంధన - ధర్మశాస్త్రవిధులు వ్రాయబడిన హృదయాన్ని మనకిచ్చింది.
- ఈ నూతన నిబంధన - దేవుడు మన పాపములు మరియు అతిక్రమములు జ్ఞాపకముంచుకొనడు అనే నిశ్చయత మనకిచ్చింది.
- ఈ నూతన నిబంధన - పాపబలియర్పణలనుండి మనల్ని విడిపించింది. క్షమాపణ పొందుకొనుటకు మనమిక ఏమి చేయనక్కరలేదు - బలులైన లేక మనల్ని మనము నలుగగొట్టుకోనుటయైన.
- ఈ నూతన నిబంధన - యేసు రక్తము ద్వారా సాక్షాత్తు దేవుని సన్నిధిలోకి ప్రవేశించే ధైర్యాన్ని ఇచ్చింది.
- ఈ నూతన నిబంధన - దేవుడు మనల్ని తిరస్కరిపంపక అంగీకరిస్తాడని పూర్ణ నిశ్చయత మనకిచ్చింది.
- ఈ నూతన నిబంధన - మనకు మంచి మనసాక్షిని ఇచ్చింది.
- ఈ నూతన నిబంధన - స్వచ్ఛమైన నీళ్లతో కడగబడిన దేహాన్ని ఇచ్చింది.
ఒక సారి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం, 16-23 వచనాలు చదవండి. ఈ నిబంధన గూర్చి పరిశుద్దాత్ముడు యిర్మీయా ద్వారా క్రీస్తు పూర్వము 650 ఏళ్ళ క్రితమే మనకు తెలియజేసాడు; మన పాపములు ఇక ఏనాటికి గుర్తుంచుకొనడని ఆయన హామీ ఇచ్చాడు. (యిర్మీయా 31:31-34).
కాబట్టి నూతన నిబంధనలో ఎంతో నిరీక్షణ ఉంది. మనమిప్పుడు దేవుని మహిమను ముఖాముఖి చూస్తూ ఆయన పోలికచొప్పున మారేదము. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనిషితో చేసిన ఒడంబడికలోని శాశ్వతతను గమనించండి. మన పాపాలు శాశ్వతంగా క్షమించబడ్డాయి మరియు మరలా గుర్తుండవు.
to be continued......................
No comments:
Post a Comment