రెండొవ భాగం నుండి కొనసాగింది .............
మనం ఇప్పటివరకు పౌలు యొక్క సువార్త దేవునిపై విశ్వాసం మరియు క్రొత్త నిబంధనపై ఆధారపడి ఉందని చూశాము. ఇప్పుడు మూడోవ అంశాన్ని చూద్దాము.
3. అది సమాధానపరచుటపై (సయోధ్య) ఆధార పడియున్న సువార్త:
సయోధ్య అంటే పునరుద్ధరణ లేదా తిరిగి కలవడం. లోకమును తిరిగి ఆయనతో కలుపుకోవడానికి దేవుడు చొరవ తీసుకుంటున్న ఆలోచనను పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తాడు; మానవునితో సంబంధాలు తిరిగి పునరుద్ధరించు కోవాలని దేవుని ప్రయత్నాం. "అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద (impute) మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు..........." - (2 కొరింథీ 5:19). ఏదెను తోటలో పాపం చేసిన ఆదాము దేవునికి దూరంగా వెళ్లి దాగుకొన్నాడు కానీ దేవుడు తనను వెదుకుతూ తన వెంట వచ్చాడు.
మనము ఎవరినైనా నిందిస్తూ లేదా వారిపై ఆరోపణలు చేస్తూ వారితో (సమాధాన పడలేము) రాజీపడలేము.
అందువల్ల, క్రీస్తులో దేవుడు మన పాపాలకు నిందను మరియు శిక్షను తనపై వేసుకున్నాడు. అంతేగాక మనపై ఆరోపణలు చేయకుండా లేక మన ప్రవర్తనకు సంజహిషి కోరకుండా ఇప్పుడు "నేను స్వయంగా మీ శిక్షను తీసుకున్నాను, నేను మీ నిందను తీసుకున్నాను; కాబట్టి మీరు ఇప్పుడు నిరపరాధులు. మీ తప్పిదములు నేను లెక్కకు తీసుకొనుటలేదు. మిమల్ని శిక్షించాల్సిన అవసరం నాకిక లేదు. నేను మీపై అన్ని ఆరోపణలను విరమించుకుంటున్నాను." అని చెబుతున్నాడు. దేవుడు దీన్ని చేయగలడు ఎందుకంటే ఒక నేరానికి ఒక్కసారి మాత్రమే శిక్షించవచ్చును - ఆ శిక్షను ఆయన పొందాడు.
'మోపక' (Impute) అంటే లెక్కకు తీసుకొనుట. ఇది ఒక అకౌంటింగ్ పదం. దేవుని ఖాతా పత్రికలోని వ్యత్యాసం ఒక్కసారిగా సరిదిద్దబడింది. మన రుణాన్ని ఆయన తీర్చి బాకీని కొట్టివేసాడు. సమాధానపరచుట అనగా భూత, వర్తమాన మరియు భవిష్యత్ మానవులందరి పాపాలను తీసుకొని, తన కుమారుడైన యేసు క్రీస్తుపై వేయుట మరియు యేసు క్రీస్తు నీతిని తీసుకొని మనపై వేయుట. మానవునిపై నేరారోపణ కొట్టివేయుట.
మనము ఇప్పుడు క్రీస్తు నీతిని ధరించుకొన్నాము. దేవుడు తన కుమారుని చూసే విధంగా మనలను చూస్తున్నాడు. దేవుడు యేసును ప్రేమిస్తున్నట్లే మనలను ప్రేమిస్తున్నాడు (యోహాను 17:23). ఇది ఒక దైవిక మార్పిడి లేదా దైవిక సయోధ్య.
"దేవుడు మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను" (2 కొరింథీ 5:21)
యేసు క్రీస్తు ఏ పాపమూ చేయకుండా పాపం అయ్యాడు మరియు మనం ఏ నీతికార్యం చేయకుండా నీతిమంతులం అయ్యాము.
పౌలు దానిని ఇలా ధృవీకరించాడు "దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మఅను సంచకరువును (ముందస్తు చెల్లింపు) మనకనుగ్రహించియున్నాడు" (2 కొరింథీ 5:5)
సయోధ్య కార్యాన్ని దేవుడు స్వయంగా చేసాడు, ఆయన మనకి పరిశుద్దాత్మను ఇవ్వడం ద్వారా లావాదేవీని ధృవీకరించాడు. పరిశుద్దాత్ముడు దీనిని వేరొక చోట ఇలా నిర్దారిస్తున్నాడు, "మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు" (రోమా 8:16)
దేవునికి మరియు మానవునికి మధ్య జరిగిన దైవిక మార్పిడి ఖచ్చితమైనదని రుజువుపరచుటకు దేవుడు పరిశుద్దాత్ముని సంచకరువుగా లేక ముందస్తు చెల్లింపుగా ఇచ్చాడు. మనమికనుండి శాశ్వితంగా దేవుని సొత్తు అని చెప్పటానికి ఇదే సాక్షము. పరిశుద్దాత్మ యందు ముద్రింపబడియున్నారు (ఎఫె 4:30)
"మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా (ముందస్తు చెల్లింపు) ఉన్నాడు." (ఎఫిసీ 1:13-14)
"ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు" (2 కొరింథీ 1:22)
దేవుడు మరియు మానవుని మధ్య ఈ లావాదేవీలో శాశ్వత భావాన్ని గమనించండి. మనము ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధించి, ఆయన మరణం దేవునితో మన సయోధ్య కోసమని గుర్తించినట్లయితే, మనం దేవుని నీతిగా మారి, ఎప్పటికీ దేవునికి చెందినవాళ్ళమే. ఇది కదా శుభవార్త!
No comments:
Post a Comment