నాల్గవ భాగం నుండి కొనసాగింది...............................
అపొస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్త విశ్వాసం, క్రొత్త నిబంధన, దత్తపుత్రత్వము మరియు సయోధ్యపై ఆధారపడి ఉందని మనం ఇప్పటివరకు చూశాము.
మనమిప్పుడు అపొస్తలుడైన పౌలు సువార్త యొక్క ఐదవ అంశానికి వచ్చాము.
5. ఇది ప్రాయశ్చితంపై (శాంతికరము - కరుణాధారము) ఆధారపడిన సువార్త
ప్రాయశ్చిత్తము అనేది దేవున్ని శాంతింపజేయడం లేదా ప్రసన్నం చేసుకోవడం; దైవిక అనుగ్రహం పొందుకొనుటకైనా లేదా దైవిక ప్రతీకారం నుండి తప్పించుకోవడానికైనా. ఈ పదం బైబిల్లో 3 సార్లు మాత్రమే ప్రస్తావించబడింది.
రోమా 3:24-26 - "కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని. క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను"
1 యోహాను 2:22 - "ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు"
1 యోహాను 4:10 - "మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది"
మనము (ఆదాములో) పాపం చేసినప్పుడు, దేవుడు చాలా కోపగించుకొన్నాడు. ఆయనతో తిరిగి సత్సంబంధాలు కలిగియుండుటకు మనము మన పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసు కోవలసియుండెను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తునందున, మన అవిధేయతను చూసి చూడనట్లు విడిచిపెట్టుటకు ఆయన నీతి స్వభావం అనుమతించదు. మరోవైపు, కోపంగా ఉన్న దేవుణ్ణి మనం ఎప్పటికీ ప్రసన్నం చేసుకోలేము. కాబట్టి, మనము నిస్సహాయంగా మిగిలి పోయాము.
సహాయము చేయటానికి వచ్చిన దేవునికి కృతజ్ఞతలు. దైవిక న్యాయం సంతృప్తి చెందడానికి మరియు మనం మరోసారి ఆయనతో రాజీపడటానికి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును మన ప్రాయశ్చిత్తంగా పంపాడు. దైవిక న్యాయం సంతృప్తి పరచడానికి మరియు పాపాత్మకమైన మనిషిపై దేవుని కోపాన్ని చల్లార్చడానికి యేసు రక్తం చిందించబడింది.
కాబట్టి, శుభవార్త ఏమిటంటే, యేసు రక్తం ద్వారా దేవుని పవిత్ర సన్నిధిలోనికి ప్రవేశించడానికి మనకు ఇప్పుడు ధైర్యం ఉంది.
గుర్తుంచుకోండి, దేవునికి దగ్గరవుచున్నకొలది పాపానికి దూరం అవుతాము.
పాపము మానవుని భయపెట్టి దేవుని సన్నిధినుండి దాగుకొనట్లు చేసింది; కానీ యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఉచిత వరమైన ఆయన నీతి వలన దేవుని సన్నిధిలో నిర్భయంగా, క్షమించబడిన స్థితిలో నిలవటానికి సహాయపడింది. ఆయన మొదట మనల్ని ప్రేమించెను, గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. ఇది కదా సువార్త.
...................కొనసాగనైయుంది.
No comments:
Post a Comment