4. ఈ సువార్త దత్తపుత్రత్వ ఆధారమైనది.
2 కొరింథీయులకు 5:18 లో దేవుడు మానవునితో రాజీపడుట అను ఆలోచనను అనుసరించి, పౌలు 2 కొరింథీయులకు 6:18 లో ఇలా అన్నాడు, " మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు." మనము దేవునిచేత దత్తతు తీసుకొనబడ్డాము. ఇది మనకు శుభవార్త.
రోమా 8:14-16 లో ఇలా ఉంది "దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను8:15 లేక–స్వీకృతపుత్రాత్మ. పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము – అబ్బా తండ్రీ అని మొఱ్ఱ పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు."
దేవుడు మనలను తన కుమారులు, కుమార్తెలుగా స్వీకరించాడు మరియు దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలవాలని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. అరామిక్ హిబ్రూ పదం 'అబ్బా'ని అనువదించ కూడదని అనువాదకులు ఎంచుకున్నారు. ఇది మనకు మేలైయింది; ఎందుకంటే ఆధునిక హీబ్రూలో 'అబ్బా' అంటే 'డాడీ' అని అర్ధము. ఇది సాన్నిహిత్యం మరియు అన్యోన్యత యొక్క భావాన్ని మనకు సూచిస్తుంది. మనము దేవునితో ఇంత సన్నిహితంగా ఉండవచ్చని గ్రహింప జేస్తుంది. పరిశుద్ధాత్మ కూడా ఈ వాస్తవానికి సాక్ష్యమిస్తున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనం నిజంగా దేవుని పిల్లలు అని ధృవీకరిస్తుంది.
మరొక రకంగా చెప్పాలంటే, మనం యేసుక్రీస్తుకు సోదరులు అవుతాము. ఆశ్చర్యపోకండి! - దయచేసి రోమా 8:29 చదవండి, "ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను." అతను మొదటి సంతానం అయితే, తిరిగి జన్మించిన మనం అయన తమ్ముళ్ళము కదా.
పౌలు అదే సత్యాన్ని గలతీయ సంఘానికి వివరిస్తున్నాడు, "అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మ శాస్త్రమునకు లోబడినవాడాయెను. మరియు మీరు కుమారులై యున్నందున (అబ్బా) నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు" గలతి 4:4-7.
మనము నియమాలను (ధర్మశాస్త్రము) పాటించాల్సిన దాసులము కాము; మనము కుమారులము మరియు దేవుని వారసులముగా నడుస్తాము. ఆయనను పోలి ఉంటాము.
ఏది ఏమైనా దత్తత ప్రక్రియలో శాశ్వత భావన ఉంటుంది. గుర్తుంచుకోండి, మనల్ని ఈ రోజు దత్తత తీసుకొని మరల రేపు నిరాకరించడు. మన తండ్రి మనల్ని క్రమశిక్షణలో పెట్టవచ్చునేమోకాని ఆయన మనలను ఎన్నటికీ విడిచిపెట్టడు. ఇది మనము వినాల్సిన మరియు ప్రకటించాల్సిన సువార్త.
No comments:
Post a Comment