అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్త - విశ్వాసం, క్రొత్త నిబంధన, దత్తపుత్రత్వము, సయోధ్య మరియు కరుణాధారం మీద ఆధారపడి ఉందని మనం ఇప్పటివరకు చూశాము.
మనమిప్పుడు అపొస్తలుడైన పౌలు సువార్త యొక్క ఆరవ అంశానికి వచ్చాము.
6. ఇది విమోచనపై ఆధారపడిన సువార్త
విమోచన (విముక్తి) అంటే తిరిగి కొనుగోలు చేయడం లేదా వెల చెల్లించి తిరిగి స్వాధీనం చేసుకోవడం. ఇదివరకు మనదైనదానిని తిరిగి సంపాదించుకోవడం.
దేవునికి మనపై సర్వహక్కులు ఉన్నవి అనే వాస్తవం ఇక్కడ కనబడుచున్నది. మనము మొదట దేవునికి చెందినవారము. కాని తోటలో సాతాను మాట వినుట ద్వారా, మనము దేవునితో మన స్థానాన్ని కోల్పోయాము మరియు సాతాను సంతతి అయ్యాము. కానీ గొర్రెపిల్ల రక్తంతో దేవుడు మనల్ని తిరిగి కొనుగోలు చేశారు (విమోచనం).
అపో. కా. 20:28 - "దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆయావత్తుమందనుగూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి"
20:28 అనేక ప్రాచీన ప్రతులలో–ప్రభువు అని పాఠాంతరము.
ఎఫెసీ 1:14 - "దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించు కొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు"
మత్తయి 20:28 - "ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను"
మార్కు 10:45 - "మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను"
1 పేతురు 1:18-19 - "పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టు నట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడ లేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా"
ప్రకటన 5:9 - "ఆ పెద్దలు– నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి"
ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తంతో మనల్ని తిరిగి కొన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, మనల్ని విడిపించడానికి చెల్లించిన విమోచన క్రయధనం ఇది. దేవుడు తన రక్తంతో మనలను కొన్నాక, అతను మనలను నిరాకరిస్తాడా? అనాధలుగా విడిచిపెడతాడా?
మనల్ని విమోచించడం మరియు మనల్ని ఆయన సొంతం చేసుకోవడం దేవుని తీసుకొన్న చొరవ. మనము ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించాడు. దేవుడు మనకొరకు చేసిన ఆ మహత్కార్యమును విశ్వసించుట ద్వారా మనము ఆయన పిల్లలుగా అవుతాము.
మరొకసారి మన స్థానం యొక్క శాశ్వత భావనను చూడండి. మనము దేవుని సొత్తు. మనము ఆయనకు విలువైన సంపాధ్యము. ఆయనకు చెందిన దానిపట్ల ఎంతటి శ్రద్ధ వహిస్తాడో నేను మీకు చెప్పనక్కరలేదు. దీనినే శుభవార్త లేక సువార్త అంటారు. ఆమెన్!
.................కొనసాగనైయుంది
No comments:
Post a Comment