Saturday, August 22, 2020

యేసుక్రీస్తుని గూర్చిన పౌలు సువార్త - ఏడవ భాగం

 ఆరవ భాగం తరువాయి ......... 


7. ఇది సమర్థన ఆధారమైన సువార్త

ఒకరు సామర్ధింపబడాలంటే తన కేసు తానే వాధించుకోవాలి లేక ఎవరో తనను నిర్దోషిగా ప్రకటించాలి.   

యేసుక్రీస్తు సిలువపై మన స్థానాన్ని తీసుకొన్నాడు.  ఈ కార్యములో ఆయనతో మనము సిలువ వేయబడినట్లుగా దేవుడు భావించాడు.  మనము వాస్తవానికి ఆయనతో సిలువపై మరణించక పోయినను, క్రీస్తు మరణం దైవిక న్యాయాన్ని సంతృప్తి పరచడానికి తగిన శిక్షగా దేవునిచే పరిగణించబడింది.   ఈ సమర్ధన మనమేదో చేయుటవలన కలిగింది కాదు - దేవుడు, క్రీస్తు బలియాగాన్ని మన ఖాతాలో అంగీకరించుట వలన మనల్ని మన్నించగలిగాడు. 

దేవుడు ఇప్పుడు మనల్ని నిర్దోషులుగా చూస్తున్నాడు.  మనమిప్పుడు క్షమించబడిన స్థితిలో ఉన్నాము.  అందుకే "నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని" పౌలు చెప్పగలిగాడు. 

మనలో యేసుక్రీస్తును చూడకుండా దేవుడు మన వైపు చూడడు.
మరియు యేసుక్రీస్తులో మనల్ని చూడకుండా దేవుడు ఆయనవైపు చూడడు. 

మనం క్రీస్తులో లేదా క్రీస్తుతో ఉన్నామని పౌలు పదేపదే వ్రాయడంలో ఆశ్చర్యం లేదు

గుర్తుంచుకోండి, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ వ్యక్తి సమర్థించబడడు లేదా ధర్మబద్ధంగా లెక్కించబడడు (రోమా 3:28).  విశ్వాసం ద్వారా నీతిమంతులుగా పరిగణించ బడుతున్నందున, మనము దేవుడితో సమాధానము కలిగియున్నాము. (రోమా 5:1)

కానీ మనము సమర్థన కోసం ధర్మశాస్త్రాన్ని పాటించటానికి ప్రయత్నిస్తే, మనము కృప నుండి తొలగిపోయినవారమే.  (గలతి 5:4)

మరియు ఆయన ఎవరిని సమర్థిస్తాడో, వారిని ఎవరూ ఖండించలేరు.  "దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;  శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే.  క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? (రోమా 8:33-35)

దేవుని ఎన్నిక యొక్క శాశ్వతతను మరోసారి చూస్తాము.  సిలువపై యేసుక్రీస్తు చనిపోవడం  - మనం సిలువపై చనిపోయినట్లుగా దేవుడు భావిస్తున్నాడు. వాస్తవానికి జరిమానా చెల్లించకుండా మనము క్షమించబడ్డాము. నీటి బాప్తిస్మము కూడా ఈ విషయానికి సూచన కదా? (రోమా 6:3).  ఇది కదా సువార్త. 

మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగ లేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.  మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలినయెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.  కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. (రోమా 5:16-18)

మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,... (తీతు 3:7)

మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక (అపో.కా. 13:39)

ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు (రోమా 3:20)

కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు (రోమా 3:24)

కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము (రోమా 5:1)

కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము (రోమా 5:9)

మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలోచేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా (గలతి 2:16)

ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే (గలతి 3:11)

కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను (గలతి 3:24)

మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు (గలతి 5:4)


  .................................సమాప్తం 

 

No comments:

Post a Comment

WHAT IS THE BETTER PART?

Jesus, Mary and Martha Recently, I was conversing with a family friend and referred to her dear husband as her 'darling'.  She immed...