అపోస్తలుడైన పౌలు |
పౌలు బోధించిన సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు నుండి ద్యోతకం (ప్రత్యక్షత) ద్వారా పొందుకున్నాడు - గలతి 1:11-12
- ఈ సువార్త ఏమిటంటే - మనం విశ్వాసం ద్వారా మాత్రమే రక్షింపబడ్డాము.
- ఈ సువార్త ఏమిటంటే - దేవుడు మనతో చేసిన ఒడంబడిక ద్వారా మనం రక్షింపబడ్డాము.
- ఈ సువార్త ఏమిటంటే - మనము దేవునితో రాజీపరచబడ్డాము.
- ఈ సువార్త ఏమిటంటే - మనల్ని దేవుడు దత్తతు చేసుకొన్నాడు.
- ఈ సువార్త ఏమిటంటే - మనకు ఆయన శాంతికరమై యున్నాడు.
- ఈ సువార్త ఏమిటంటే - మనము విమోచించబడ్డాము.
- ఈ సువార్త ఏమిటంటే - మనము సమర్థించబడ్డాము.
పైన పేర్కొన్నవన్నీ క్రీ. శ. 29 లో యేసుక్రీస్తు మరణించిన సిలువపై జరిగాయి. వాటిని గుర్తించి అంగీకరించిన వారికందరికి ఇవి వర్తిస్తాయి. ఎంత అద్భుతమైన అవకాశం!
యేసుక్రీస్తు రక్తం మనకు శాంతికరమై, ఆయన మనతో చేసుకొన్న సమాధానపరచు నిబంధనయందు విశ్వాసం ఉంచుట వలన విమోచింపబడి, నీతిమంతులుగా తీర్చబడి, దేవునిచేత దత్తతు చేయబడ్డామని గుర్తిస్తే మన దృష్టికోణం ఎలా ఉంటుందో?
మన తండ్రియైన దేవుని చేత మనం అత్యధికంగా ప్రేమింపబడుచున్నామని, ఆయన కృపాకనికరములు మనపట్ల మెండైనవని, ఉన్నతమైన దీవెనలకు పాత్రులమని గుర్తించక తప్పదు.
ఈ యోగ్యత విశ్వసించువారిదైతే, నిశ్చయముగా విశ్వసింపబోవువారిది కూడా అని చెప్పుటకు సందేహం లేదు. ఇదికదా సువార్త.
మన పరిస్థితులు మరలా సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు, ఈ అసమానమైన శుభవార్తను నామకార్ధ విశ్వాసులు మరియు అవిశ్వాసులకు మనము తీసుకొని వెల్దాము. వారిదైనా దానిని స్వీకరించమని వాళ్లను ఒత్తిడి చేద్దాము.
శుభవార్త అంటే - విశ్వసించకపోతే నరకాన్ని వెళ్తారని చెప్పడమా ? లేక విశ్వసిస్తే పరలోకానికి వెళ్తారని చెప్పడమా ? అనర్హమైన మరియు అయోగ్యమైన వారిపై దేవుడు చూపు కృపావాత్సల్యతను వారు తిరస్కరించుట కష్టము. దేవుని ప్రేమ మరియు అనుగ్రహము మనుషులను మారుమనస్సుకు నడిపిస్తాయి. (రోమా 2:4)
గుర్తుంచుకోండి, మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచ బడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. - 1 యోహాను 4:9-10
-
Melchizedek
No comments:
Post a Comment